ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ వృద్ధ ఖైదీకి ఘనంగా వీడ్కోలు పలికారు జైలు అధికారులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామ్ సూరత్ (98) అనే వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో స్థానిక కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు అతను అయోధ్య జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా శిక్ష అనంతరం అతను ఇటీవల రిలీజ్ అయ్యాడు.
రామ్ సూరత్ వృద్ధుడికి 100 సంవత్సరాలు దగ్గర పడటంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్ర ఘనంగా వీడ్కోలు పలికాడు. అనంతరం కారు ఇచ్చి మరీ ఇంటికి చేర్చాడు. వాస్తవానికి సూరత్ గతేడాది ఆగస్టు 8న విడుదల కావాల్సి ఉంది.
కానీ మే 20న అతనికి కరోనా నిర్దారణ కావడంతో 90 రోజులు పెరోల్ పై ఉన్నారు. ఈ మేరకు తాజాగా అతను రిలీజ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB
— DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023