చార్ ధామ్‌లో భక్తుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం మరో ఎనిమిది మంది భక్తులు మరణించారు. మే3న యాత్ర మొదలు కాగా ఇప్పటి వరకు 99 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
మరణాల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా వృద్దులు ఉంటున్నారని, ఈ క్రమంలో యాత్రికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. యాత్ర రూట్ లో వైద్య సిబ్బందితో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు రుద్రప్రయాగ్ జిల్లాలో పాండవ్ శేరా కొండపైకి ట్రెక్కింగ్ కోసం వెళ్లిన ఏడుగురు తప్పిపోయినట్టు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ బృందాలను పంపించినట్టు వివరించారు.
గాలింపు చర్యల కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వీరంతా పాండవ్ శేరిలో ట్రెక్కింగ్ పై ప్రత్యేక డాక్యుమెంట్ ను చిత్రీకరించడానికి వెళ్లినట్టు తెలుస్తోందని చెప్పారు.