పాకిస్తాన్ రోడ్లు నెత్తురోడాయి. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గత 24 గంటల్లో 995 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 9 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 594 మందికి తీవ్ర గాయాలైనట్టు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం..
ఇందులో అత్యధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకు సంబంధించి నమోదయ్యాయి. బాధితుల్లో 512 మంది డ్రైవర్లు, 12 మంది డ్రైవర్లు(మైనర్లు), 118 మంంది పాదచారులు, 432 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఈ ప్రమాదాల జాబితాలో లాహోర్ మొదటి స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం లాహోర్ లో 230 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఫైసలాబాద్ 77 ప్రమాదాలు, గుజ్రాన్ వాలా 69 ప్రమాదాలు ఉన్నాయి.
ఈ ప్రమాదాల్లో మొత్తం 1053 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో గాయపడిన వారిలో 853 మంది పురుషులు, 209 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో 18 ఏండ్ల లోపు వాళ్లు 201 మంది, 18 నుంచి 40 వయస్సు వారు 550 మంది, 40 ఏండ్లకు పైబడిన వారు 311 మంది ఉన్నారు.