మహారాష్ట్రలో అత్యంత క్రూరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.15 సంవత్సరాల బాలికపై 29మంది మృగాళ్లు అత్యాచారం చేశారు.ఈ సామూహిక అత్యాచారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. థానే జిల్లాలోని డోంబివలి గ్రామానికి చెందిన 15సంవత్సరాల అమ్మాయికి అదే గ్రామానికి చెందిన అబ్బాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ అమ్మాయితో కలిసిన సమయంలో రహస్యంగా వీడియోలు తీసి బయటకు చెప్తే వీడియో అందరికీ పంపుతానంటూ అనేక రకాలుగా హింసించటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే వీడియో కొందరి చేతికి చిక్కింది. వాళ్లు కూడా బెదిరించి డోంబివలితో పాటు బద్లాపూర్, రబేల్, ముర్బాద్ లలో గత జనవరి నుంచి అత్యాచారం చేస్తూ వచ్చారు. అలా ఆమెపై ఏకంగా 29మంది అత్యాచారం చేశారు. చివరకు ఆ మానవ మృగం వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం బయటకు తెలిసింది.
బాలికపై అత్యాచారం చేసిన 29మందిలో 25మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉండగా… వీరందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.