ఆర్టీసీ బస్సు ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్‌ను స్థానికులు, తోటి ప్రయాణికులు చితకబాదారు. అంతా అయ్యోపాపం… అన్యాయంగా చనిపోయింది, సీఎం కేసీఆర్ మొండి వైఖరికి మరో ప్రాణం బలైంది… కొట్టాల్సింది డ్రైవర్‌ను కాదు సీఎంను అంటూ జనం కోపంతో ఊగిపోతున్న సమయంలో ఓ వ్యక్తి ఆ మహిళ రక్తపు మడుగులో పడి ఉంటే… ఎవరైనా సహయం చేస్తాం. లేదంటే అంబులెన్స్‌కు ఫోన్ చేస్తాం కానీ సెల్ఫీ తీసుకుంటూ… ఫోటోలు దిగటంపై సోషల్ మీడియాలో జనం మండిపడుతున్నారు.
మానవత్వం మంటగలిసి పోయిందంటే వినటమే… ఇప్పుడు చూస్తున్నాం అంటూ ఫైర్ అవుతున్నారు.