పసితనం. అన్నీతెలుసుకోవాలనే కుతూహలం. అన్నిటికీ రడీ అవుతారు. చెబితే వినరు కొడితే ఏడుస్తారు. వద్దన్న పని చేసి కన్నవాళ్ళకి చుక్కలు చూపిస్తారు. బాల్యంతో ఈ ఇబ్బందులు తప్పవు. ఓ బాలుడు కొప్పర గిన్నెలో ఇరుక్కుపోయి నానా హంగామా చేసాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో రెండేళ్ళ బాలుడు కొప్పరగిన్నెలో ఇరుక్కుపోయాడు. బయటకు రావడానికి తిప్పలు పడ్డాడు. తాను ఎంతకీ బైటకు రాలేకపోవడంతో ఏడ్వడం మొదలెట్టాడు.
గమనించిన తల్లిదండ్రులు కొప్పెరలో తమ కుమారుడు ఇరుక్కుపోవడంతో బెంబేలెత్తిపోయారు. బైటకు తీసేందుకు నానాతిప్పలు పడ్డారు. ఐనా రాకపోవడంతో వెల్డింగ్ షాపు దగ్గరకు తీసుకెళ్ళి కట్టర్ల సాయంతో కొప్పర గిన్నెని కట్ చేసి బాలుణ్ణి సురక్షితంగా బైటకు తీసారు. అనంతరం ప్రాథమిక చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు తలిదండ్రులు.