ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ ఇకపై ఇండియాలో కార్ల తయారు నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఇండియాలో జనరల్ మోటార్స్ అండ్ అండ్ హార్లీ డేవిడ్సన్ వంటి యుఎస్ కంపెనీలు ఇండియాలో తమ ఉత్పత్తిని నిలిపి వేసిన విషయం తెలిసిందే. యూఎస్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కో భారతదేశంలో కార్లు తయారిని నిలిపి వేస్తున్నట్టు, దాని ప్లాంట్లను మూసి వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఫోర్డ్ ఇండియా సనంద్ ప్లాంట్ లో వాహనాల తయారీని క్యూ4 ను 2021, క్యూ4ను 2022 నాటికి చెన్నై ప్లాంట్ లో పూర్తిగా నిలిపి వేస్తామని తెలిపింది.
ప్రస్తుతం ఇండియాలో ఫోర్డ్ కార్ల అమ్మకం పెద్దగా లాభదాయకంగా లేనందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా ప్రత్యర్థులు ఆధిపత్యం ఉన్న ఈ మార్కెట్ ను విడిచిపెట్టి తాజా ఆటో మేకర్ గా అవతరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియకు దాదాపు ఒక సంవత్సరం పడుతుందని అంచనా. ఇండియాలో ఫోర్డ్ సామాన్యుల మనసును గెలుచుకోవడానికి సుజుకి మోటార్ కార్ప్, హ్యుందాయ్ మోటార్ వంటి తక్కువ ధర గల కార్లు తయారు చేసే కంపెనీలతో పోటీపడి నిలదొక్కుకోవడానికి, ఈ మార్కెట్లో లాభం పొందడానికి చాలా కష్టపడింది.
ప్రస్తుతం ఇండియాలో పలు కార్ల కంపెనీలు సామాన్యులతో పాటు హై రేంజ్ ఉన్న కార్లను కూడా అందిస్తున్నాయి. దీంతో ఫోర్డ్ ఇప్పుడు నష్టాలు ఎదుర్కోక తప్పడం లేదు. అయితే ఫోర్డ్ అభిమానులకు మాత్రం ఇది షాకిచ్చే విషయమని చెప్పవచ్చు.