పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని ఎపిసోడ్ మంటలు రగులుతూనే ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వమే సినిమా టికెట్స్ అమ్మే జీవోపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయటం, దానికి కౌంటర్ గా పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో వివాదం మొదలైంది. పవన్ అభిమానుల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ పోసాని రాయలేని భాషలో తిట్టిపోయటంతో వివాదం మరింత పెద్దది కాగా, పోసానిని అడ్డుకునేందుకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు.
అయితే, పోసాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ… జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోసానిని ప్రెస్ మీట్ పెట్టకుండా నిరోధించాలని, తన వల్ల పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందని కంప్లైంట్ లో వివరించారు.