కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రధాని మోడీ ఎనిమిదేండ్ల పాలనపై ఆయన మండిపడ్డారు. ప్రధాని పాలనను ఓ కేసు స్టడీగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలనే దానిపై ప్రధాని మోడీ 8 ఏండ్ల దుష్పరిపాలన ఓ కేస్ స్టడీ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతకుముందు దేశంలో విద్యుత్ సంక్షోభంపై ప్రధాని మోడీని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ విషయంలో వైఫల్యానికి ప్రధాని ఎవరిని నిందిస్తారని ప్రశ్నించారు.