గాలిపటం కారణంగా ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. తండ్రితో రోడ్డుపై వెళ్తుండగా గాలిపటం మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యీయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 6 సంవత్సరాల కీర్తి అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి 13వ తేదీన సాయంత్రం వనస్థలి పురం నుంచి ఉప్పల్ కి బైక్ పై వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే నాగోల్ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పిల్లర్ కు వేలాడుతూ ఉన్న గాలిపటం మాంజా తగిలింది. దీంతో చిన్నారి తండ్రి ముక్కుకి, చిన్నారి మెడకు చుట్టుకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స చేసి అనంతరం చిన్నారిని ఎల్బీనగర్ రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.