చిన్నారులపై వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే బాలిక తృటిలో వాటి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడలో చోటుచేసుకుంది.
దారి వెంట వెళ్తున్న చిన్నారిని రెండు కుక్కలు వెంబడించాయి. దీంతో ఆ చిన్నారి వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టింది. చిన్నారిని కుక్కలు కూడా వెంబడించాయి. ఈ క్రమంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి కుక్కలను రాళ్లతో బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
దీంతో ఆ చిన్నారి ఊపిరిపీల్చుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అంబర్ పేట ఘటన తర్వాత జీహెచ్ ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను బంధించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టారు. చిన్నారులను వీధుల్లో ఒంటరిగా వదిలేయకూడదని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.