హర్రర్ సినిమాలంటే ఇష్టమా? ఎంత భయంకరమైన సినిమాలనైనా చూసే ధైర్యముందా? అయితే మీలాంటి వారికో అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది ఫైనాన్స్ బజ్( FinanceBuzz) వెబ్‌సైట్ . తాము సూచించే 13 హర్రర్ మూవీలను చూస్తే.. రూ. లక్ష వరకు గెలుచుకోవచ్చని చెబుతోంది.షరతు ఏమిటంటే ఈ మూవీలు చూస్తున్నప్పుడు ఫైనాన్స్ బచ్ కంపెనీ ఇచ్చే ఓ ఫిట్‌బిట్‌ను మీరు ధరించాల్సి ఉంటుంది. ఆయా సినిమాలు చూస్తున్నప్పుడు మీ హృదయ స్పందన ఎలా ఉంటుందన్న వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
పోటీలో పాల్గొనేవారు ఏయే హర్రర్ మూవీలు చూడాలో ఫైనాన్స్ బజ్ ముందే ఓ జాబితాను ప్రకటించింది. ఈ పోటీ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే.. అధిక బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు అధికంగా భయపెడతాయా లేక తక్కువ బడ్జెట్ పెట్టినా ప్రేక్షకులను భయపెట్టొచ్చా అన్నది తెలుసుకోవడమే.
అక్టోబర్ 9 -18 తేదీల మధ్య పోటీలో పాల్గొనేవారు ఈ సినిమాలను చూడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 26 నాటికల్లా ఆప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 1న మెయిల్ ద్వారా విజేతలను ప్రకటిస్తారు. సినిమాలు చూసే వారి వయస్సు కచ్చితంగా 18 పైబడి ఉండాలి. సినిమాలను చూసిన వారికి $1,300 నగదుతో పాటు $50 గిఫ్ట్ కార్డును ఇస్తారు. పోటీదారులు చూడాల్సిన మూవీలివే
Saw
The Amityville Horror
A Quiet Place
A Quiet Place Part II
Candyman
Insidious
The Blair Witch Project
Sinister
Get Out
The Purge
Halloween (2018)
Paranormal Activity
Annabelle