– ఒక్కొక్కటిగా వెలుగులోకి నాగేశ్వరరావు అక్రమాలు
– రంగారెడ్డి జిల్లాలో ఐఏఎస్ అధికారి అవినీతిపై చర్చ
– నెక్ట్స్ ఆయన చిట్టా బయటపడాలని కోరుకుంటున్న ప్రజలు
పాపం పండిన రోజు పుర్రె పుచ్చకాయ పగిలినట్టుగా పగులుతుందని ఒక సామెత ఉంది. మాజీ సీఐ నాగేశ్వరరావు పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెదులుతూ.. టాస్క్ ఫోర్స్ కు చెందిన రాధాకిషన్ రావు చెప్పిన పని చేస్తూ.. ఎవరి మీదకి వెళ్లమంటే వాళ్ళ మీదకి వెళ్తూ అందరి దృష్టిలో పడ్డ ఈయన ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు.
స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులే నాగేశ్వరరావు వెనుక ఉన్నా కాపాడలేక చేతులు ఎత్తేశారు. ఆయన చేసిన అక్రమాలతో ఇప్పుడు కుటుంబ సభ్యులు సైతం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఇలాంటి అధికారుల లిస్టు రాష్ట్రంలో చాలా పెద్దదనే వాదన నడుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉంటూ, సీఎం బంధువు చెప్పిన పనల్లా చేస్తూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నాడని అంటున్నారు.
ఆ ఉన్నతాధికారి అన్ని రకాల అక్రమాలు చేస్తూ ప్రభుత్వ పెద్దలకు దొచిపెడుతున్నాడట. అంతేకాక కొందరు రాజకీయ నాయకులకు ఈయన పంటి కింద రాయిలా మారారని, ఒకవేళ ప్రభుత్వం మారితే ఇతని అక్రమాలు కూడా బయటపడి ఉచ్చు బిగుస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ ఐఏఎస్ అధికారి చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావని సుమారుగా రూ.1,000 కోట్ల సంపాదనతో ఉన్నాడని అంటున్నారు.
సీఎం బంధువు తన వెనక ఉన్నాడనే అహంకారంతో ఉన్న అధికారి.. ఎవరినీ లెక్క చేయట్లేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా అతి త్వరలో ఇతని అక్రమాలు కూడా బయట పడి ప్రజల ముందు దోషిగా నిలబడే రోజు త్వరలో రావాలని అందరూ కోరుకుంటున్నారు.