హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ శునకం వీరంగం సృష్టించింది. శునకం డెలివరి బాయ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. ప్రస్తుతం డెలివరి బాయ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్యులు అతనికి చికిత్స పొందుతూ ఉన్నాడు.

డెలివరి బాయ్ వచ్చే సరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. దీంతో డోర్ దగ్గర నిల్చుని కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ శబ్దం విని ఇంట్లో నుంచి జర్మన్ షెపర్డ్ కుక్క ఒక్కసారిగా డెలివరి బాయ్ వైపునకు దూసుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్‌ని కరిచేందుకు ప్రయత్నించింది.
దీంతో డెలివరి బాయ్ రిజ్వాన్ ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు వెంటనే పరుగు లంకించాడు. దీంతో ఆ కుక్క కూడా అతని వెంట పడింది. ఈ క్రమంలో ఏం చేయాలో అర్థం కాక వెంటనే మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.
దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆ శునకం యజమాని డెలివరి బాయ్‌ను ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం రిజ్వాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రిజ్వాన్ కుటుంబసభ్యులు ఆ శునకం యాజమాని శోభనపై కేసు పెట్టారు. పోలీసులు శోభనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.