విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ కోస్తా ప్రాంత ప్రజలకు ఇలవేల్పు. అమ్మని నమ్మిన వారికి ఎటువంటి బాధలు వుండవని స్థానికుల్లో ఒక విశ్వాసం. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలకు విధిగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి వారి ఆచారం. అలాగే, శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి విలువైన కానుకల్ని సమర్పించడం కూడా ఇక్కడ ఏటా జరుగుతుంటుంది.
ఈసారి ఉత్సవాల్లో ఒక భక్తుడు రూ.10లక్షల విలువ చేసే నీలాల హారాన్ని సమర్పించారు. విజయవాడకు చెందిన ధనేకుల వెంకట భవానీ ప్రసాద్ 253 గ్రా. బంగారు నీలాభరణాన్ని ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మకు అందించారు.