భారత సంతతికి చెందిన 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్.. మహిళా పేషెంట్లను వేధించిన కేసులో దోషిగా తేలాడు. స్కాట్‌లాండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. తన 35 ఏండ్ల సర్వీస్ లో సుమారు 48 మంది మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు నిర్ధారణ అయ్యింది. జీపీ డాక్టర్ గా కొనసాగుతున్న కృష్ణ సింగ్.. మహిళా రోగులతో అసభ్యకరంగా వ్యవహరించారనే ఆరోపణలతో.. గ్లాస్ గోలోని హైకోర్టులో కేసు విచారణ జరిగింది.
ఈ విచారణ సమయంలో పేషెంట్లు చేసిన ఫిర్యాదులను డాక్టర్ తప్పుపట్టారు. ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో ఆ పరీక్షల గురించి నేర్చుకున్నట్టు డాక్టర్ చెప్పాడు. నార్త్ లనార్క్‌షైర్ లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎక్కువగా మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవాడని ఆరోపణలు ఉన్నాయి.
మహిళా రోగుల్ని లైంగికంగా వేధించినట్లు ప్రాసిక్యూటర్ ఏంజిలా గ్రే వాదించారు. 2018లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో డాక్టర్ ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో అతను దోషిగా తేలినట్టు తెలుస్తోంది.
Advertisements
ఈ కేసు సంబంధించి తీర్పును వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్టు కోర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం నిందితునికి బెయిల్ ఇస్తూ జడ్జి తీర్పునిచ్చారు. కాగా.. డాక్టర్ కృష్ణ సింగ్ కు స్కాట్‌లాండ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకు మెంబర్ ఆఫ్ బ్రిటీష్ అంపైర్ సత్కారం కూడా లభించింది.