అన్నతమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు మధుయాదవ్ బ్రదర్స్, హైదరాబాద్ నగరానికి చెందిన పాలవ్యాపరి మధు యాదవ్ తన తమ్ముడికి ఎప్పటికీ మరిచిపోలేని కానుకిచ్చాడు. తన తమ్ముడు చందు యాదవ్ పెళ్లి సందర్భంగా..గొప్ప బహుమతి ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.
హైదరాబాద్ నుంచి పూణే వరకు ‘ప్రత్యేక హెలికాప్టర్’లో వరుడిని తీసుకువెళ్లి.. ఉగాది పండుగనాడు పూణేలో అదరహో అనిపించేలా వేడుకను నిర్వహించారు. 150 ఏళ్ల చరిత్ర గల దగ్దుసేత్ గణపతి ఆలయంపై 7 రౌండ్లలో హెలికాప్టర్ ద్వారా.. తన తమ్ముడితో పూల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
అంతేకాదు వందల మంది కళాకారులతో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టేలా..మేళ, తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బరాత్ వేడుకను నిర్వహించారు.
ఇలా మధు యాదవ్ తన తమ్ముడి పెళ్లి వేడుకల్లో భాగంగా.. హెలికాప్టర్ తో తనదైన శైలిలో పెళ్లి కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వినూత్నంగా తమ్ముడి పెళ్లి నిర్వహించి మధు యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు.