ప్రభుత్వం చెప్పిందని సన్నవడ్లు వేశాడు. అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేశాడు. కానీ.. పంట అంత ఏపుగా రాలేదు. దిగుబడి అంతంత మాత్రమేనని భావించి నిప్పు పెట్టేశాడు. పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో జరిగిందీ సంఘటన.
తోట పెద్దన్న అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాడు. ప్రభుత్వం చెప్పిందనే సన్నవడ్లు పండించాడు. పంటకు చీడ పురుగు, దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మరీ.. మందులు కొట్టాడు. అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని పంటకు నిప్పు పెట్టాడు.
వరికోత యంత్రానికి అయ్యే ఖర్చుకు కూడా పంట రాని పరిస్థితి ఉందన్నాడు పెద్దన్న. అందుకే ఆవేదనతో పంటను తగులబెట్టానని వాపోయాడు.