విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం పేలుడు ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్-2 లిక్విడ్ విభాగంలో పేలుడు జరగడంతో 9మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, ఐదుగురు ఒప్పంద కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారందరినీ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.
తీవ్రగాయాలైనవారిని నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుటున్నాయి. ద్రవ ఉక్కును నిల్వ చేసే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన సేఫ్టీ పద్దతులు పాటించకపోవడం వల్లనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్లు తీసుకున్నా.. ప్రమాదాలు జరుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ యజమాన్యం చెబుతోంది.
సాధారణం ఉక్కు పరిశ్రమలో అదీ కూడా అది భారీ ఉత్పత్తి చేసే ఉక్కు పరిశ్రమలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అత్యంత ఉన్నమైన భద్రతా ప్రమాణఆలు పాటిస్తారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. నివారించేందుకు యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రమాదం జరిగినప్పుడల్లా గాయపడుతున్నారు.