చిన్నారులపై కుక్కల దాడి పెచ్చు మీరుతున్న నేపథ్యంలో ఓ బాలుడిపై ఎలుక దాడిచేసిన సంఘటన కలకలం సృష్టించింది. రిఫ్రెష్ అవుదామని కుటుంబంతో మెక్ డొనాల్డ్ బర్గర్ అండ్ ఫ్రైస్ కు వెళ్ళిన కుటుంబానికి ఈ చేదు అనుభవం ఎదురైంది.
పోలీసుల వివరాలు ప్రకారం స్థానికంగా ఉండే ఆర్మీ మేజర్ గా పని చేస్తున్న సవియో హెర్క్వీస్ గురువారం రాత్రి పేట్ బషీరాబాద్ హైటెన్షన్ లైన్ లో ఉన్న మెక్ డోనాల్డ్ లో కుటుంబంతో కలిసి వెళ్ళాడు.
వాళ్లకు కావాల్సిన ఆర్డర్ ను ఇచ్చి వారి టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇంతలో ఓ ఎలుక అకస్మాత్తుగా వచ్చి అతని తొమ్మిదేళ్ల కొడుకుపైకి ఎక్కి కొరికి పారిపోయింది. దీంతో బాలుడికి తొడపై గాయం అయింది.
ఈ విషయంపై మెక్ డొనాల్డ్ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లేశ్వర్ పేర్కొన్నారు.