హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలో రోజుకో చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా.. నగరంలోని సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కార్యాలయం నుండి బయటకు పరుగులు పెట్టారు.
అంతేకాకుండా భయంతో 5వ అంతస్థులోని సిబ్బంది భయంతో ఆఫీస్ టెర్రస్ పైకి ఎక్కారు. అంతే కాదు.. ఓ ఇద్దరు ఉద్యోగులు ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో చిక్కుకోవడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.
అనంతరం టెర్రస్ పైకి ఎక్కిన ఉద్యోగులను క్రేన్ సాయంతో కిందకు దించారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు ఉద్యోగులను ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో 3వ అంతస్థులో ఉన్న ఫైల్స్ అన్ని కాలిబూడిదయ్యాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు