హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. తాజాగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. వీఎస్ టీ లోని అన్నపూర్ణ బార్ సమీపంలో ఉన్న ఓ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
విషయం తెలియగానే చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు.
డెకరేషన్ సామాను గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మరో రెండు గోడౌన్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్స్ తో పాటు వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
గోడౌన్స్ పాతవి కావడంతో పైకప్పు రేకులు కూలిపోతున్నాయి. పక్కన ఉన్న మరో LED లైట్స్ గౌడౌన్ లోకి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. LED లైట్స్ గోడౌన్ లోకి పాకితే మరింత ఎక్కువగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.