సినిమా బాగున్నా సరే సరైన ప్రచారం లేకపోతే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. చాలా తెలుగు సినిమాలకు ఇలాగే జరుగుతుంది. సోషల్ మీడియాలో సరైన టాక్ లేక చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరూ ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఒకానొక సందర్భంలో చిరంజీవి కూడా ఇబ్బంది పడ్డారు. మంచి సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.
బీ గోపాల్ దర్శకత్వంలో సుబ్బిరామి రెడ్డి నిర్మించిన స్టేట్ రౌడి సినిమాకు ముందు నెగటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత స్లో గా కలెక్షన్ లు పెరిగాయి. సినిమాకు మౌత్ పబ్లిసిటి సరిగా రాక ఫ్లాప్ అనుకున్నారు అందరూ. 177 ప్రింట్లతో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. స్టేట్ రౌడీ సినిమాలో చిరంజీవికి జోడీగా రాధ, భానుప్రియ నటించారు. ఈ సినిమాలో పృథ్వీ, కాళీ చరణ్ పాత్రలో చిరంజీవి బాగా ఆకట్టుకున్నారు.
అయితే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం వెనుక కారణం మరొకటి ఉంది. సినిమా షూటింగ్ సమయంలో సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్న శశిభూషణ్ ఈనాడు విలేఖరిపై సీరియస్ అయ్యారు. దురుసుగా ప్రవర్తించడంతో ఈ సినిమాకు సంబంధించిన కవరేజ్ ఆపాలి అంటూ రామోజీ రావు ఆదేశించారు. దీనితో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది అంటారు. చివరికి సినిమా నిర్మాత రామోజీ రావుని కలిసి పరిస్థితి వివరించారు.ఆ తర్వాత సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. నైజాం ప్రాంతంలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది.