మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని చెబుతూ… అఖిల ప్రియా భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టారు. తన బిడ్డతో అఖిల ప్రియ ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా భూమా అఖిల ప్రియ తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. తన తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు అఖిలప్రియ. 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తండ్రి భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ ఇద్దరూ టీడీపీలో చేరారు. అనంతరం భూమా నాగిరెడ్డి మరణించారు. తర్వాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది. ఆ సమయంలోనే భార్గవ్ రామ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేసిన అఖిలప్రియ ఓడిపోయారు.