ఏం మాయ చేసావో, ఘర్షణలాంటి రోమాంటిక్ సినిమాల దర్శకుడు గౌతమ్‌మీనన్ మరో రోమాంటిక్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. హీరో ధనుష్‌తో తొలిసారి తమిళ్‌లో సినిమా చేస్తున్న గౌతమ్‌మీనన్… తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘా ఆకాష్ ఈ సినిమాలో ధనుష్ సరసన నటిస్తోంది. ఓ ప్రత్యేక పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
గౌతమ్‌మీనన్‌కు, ధనుష్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పైగా రోమాంటిక్ థ్రిల్లర్ కావటంతో… సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తూటాను ఈనెల 29న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా… తూటా ఎంతలా దూసుకపోతుందో చూడాలి.