12 నుంచి 17 ఏండ్ల గ్రూపు వారిలో అత్యవసర వినియోగానికి బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేసిన కార్బే వ్యాక్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు అనుమతులు మంజూరు చేసింది.
దీంతో ఈ గ్రూపు వారికి ఇప్పటికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల సంఖ్య మూడుకు చేరింది. గతంలో భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్, జైడస్ క్యాడిలాకు జైకోవ్ లకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.
ఇప్పటికే వ్యాక్సినేషన్ కోసం 5 కోట్ల కార్బే వ్యాక్స్ డోసుల కొనుగోళ్లకు కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఈ డోసులు ఫిబ్రవరి చివరికి నాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతాయని కేంద్రం చెబుతోంది.
సీరమ్ ఇనిస్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవాక్స్ ను 12 నుంచి ఏండ్ల వారిలో వినియోగానికి సంబంధించి డీసీజీఐ అనుమతులను కంపెనీ కొరుతోంది. దీనికి అనుమతులు లభిస్తే ఈ గ్రూపు వారి కోసం ఆమోదం పొందిన వ్యాక్సిన్ల సంఖ్య నాలుగుకు చేరనుంది.
ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘ మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ దేశీయంగా మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. దీన్ని 12 నుండి 18 ఏండ్ల వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది” అని పేర్కొంది.