కేంద్రంపై బీజీపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. దేశంలో బ్యాంకుల, రైల్వేల ప్రైవేటీకరణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యోగాలను కోల్పోతారని అన్నారు.
రైల్వేలు, బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ద్వారా దేశంలో 5 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల లక్షల కుటుంబాల ఆశలు సన్నగిల్లుతాయని ట్వీట్ లో అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించదని, తద్వారా అసమానతలను ప్రోత్సహించదని మండిపడ్డారు. గతంలోనూ పలుమార్లు కేంద్రంపై వరుణ్ గాంధీ విమర్శలు చేశారు.
‘ విజయ్ మాల్యా 9000 కోట్లు, నీరవ్ మోడీ 14000 కోట్లు, రిషీ అగర్వాల్ 23000కోట్లు. ఈ దేశంలో అప్పుల బాధతో రోజుకు 14 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బలమైన ప్రభుత్వం ఇలాంటి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలి” అని గత వారం ట్వీట్ చేశారు.