శ్రధ్దా హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ ని పోలీసులు పాలీగ్రాఫ్ టెస్ట్ అనంతరం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి బయటకు తీసుకు వచ్చి అతడిని వాహనంలో తీసుకువెళ్తుండగా సుమారు 15 మంది ఆ వాహనం వెంట బడ్డారు.
అఫ్తాబ్ ని 70 ముక్కలు నరుకుతామని వారు కేకలు పెట్టారు. కొందరి చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
తాము గురుగ్రామ్ నుంచి వచ్చామని,తమ సోదరి శ్రద్దాను హతమార్చి 35 ముక్కలు చేసిన ఇతడిని తాము వదలబోమని, 70 ముక్కలుగా నరుకుతామని ఈ బృందంలో ఒకరు చెప్పారు.
అయితే పోలీసులు సంయమనం వహించడంతో ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు.