తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై నేడు గవర్నర్ తమిళి సై ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఏవీఎన్ రెడ్డి కలిశారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ తో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ లు రాజీనామా చేయాలని, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను డిబార్ చేసి కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరనున్నారు.
సిట్టింగ్ జడ్జ్ తో న్యాయవిచారణ చేయించాలని, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాలయలు పరిహారం ఇవ్వాలని కోరనున్నారు. ఈ నాలుగు విషయాలపై గవర్నర్ తో బీజేపీ బృందం చర్చిస్తుంది. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలా ఉంటే..ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి.
లెక్చరర్ గా పని చేయాలన్న నిబంధనలు పక్కన పెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది. కాగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది.