పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ మూవీని తెరకెక్కించాడు ఓం రౌత్. అయితే.. చిన్నపాటి టీజర్ తో విమర్శలు పాలయ్యాడు ఈ దర్శకుడు. తప్పులను సరిదిద్దుకుంటూ.. సినిమాకు మరిన్ని తుది మెరుగులు దిద్దుతున్నాడు.
ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే రిలీజ్ డేట్ కు సంబంధించి ఓంరౌత్ కీలక అప్డేట్ ఇచ్చాడు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్ లో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. కానీ, ఆరోజున ఓ ఓ హాలీవుడ్ మూవీ రిలీజ్ కు సిద్ధమౌతోంది.
ఆదిపురుష్ రిలీజ్ అనుకున్న రోజున వార్నర్ బ్రదర్స్ నుంచి అవైటెడ్ ఫ్లాష్ అనే సినిమా వస్తోంది. ఈ రిలీజ్ ను ముందే ప్రకటించినా.. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్ లో ఆదిపురుష్ కి కాస్త కష్టమే అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ గత మూవీ నిరాసపరిచింది. ఆదిపురుష్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వసూళ్లు చాలా కీలకం. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు చాలా ముఖ్యం. మరి.. ఈ భారీ పోటీలో సినిమా ఎలా రాణిస్తుందో చూడాలి.