నెర్యూస్ (Nereus) అనే భారీ గ్రహశకలం డిసెంబర్ 11న భూమికి దగ్గరగా రాబోతోంది. దీన్ని అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసా (NASA) చాలా కాలంగా పరిశీలిస్తోంది. ఇది ఓ పెద్ద గ్రహశకలం. ఎంత పెద్దది అంటే ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఫుట్‌బాల్ గ్రౌండ్లు 3 కలిపితే ఎంత పెద్దగా ఉంటాయో… అంత పెద్దది ఇది. అందుకే ఇది ఎట్టి పరిస్థితుల్లో భూమిని ఢీకొట్టకూడదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక మన భూమికి ప్రమాదకరమైన పెద్ద పెద్ద గ్రహశకలాల్ని నాసా పొటెన్షియల్లీ హజార్డోస్ ఆస్ట్రరాయిడ్స్ (PHA) అని పిలుస్తుంది. వాటిలో నెర్యూస్ కూడా ఒకటిగా ఉంది. డిసెంబర్ 11 వ తేదీన ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు… దాని దూరం… సుమారు 39 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. అంటే… భూమికీ ఇంకా చందమామకీ మధ్య ఉన్న దూరానికి 10 రెట్లు ఎక్కువ దూరమే అని చెప్పాలి.
అందువల్ల ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు 1 శాతం కూడా లేవట. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇది 330 మీటర్ల పొడవున్న పెద్ద గ్రహశకలం. అందువల్ల ఇది వచ్చే దారిలో… మరేదైనా పెద్ద రాయి కనుక దీనికి అడ్డుపడితే… అప్పుడు దీని రూట్ అనేది మారుతుంది. అప్పుడు ఇది భూమివైపు తిరిగితే మనకు ఇబ్బందే. అందుకే ఇది వచ్చి, వెళ్లిపోయే వరకూ నాసా దీన్ని జాగ్రత్తగా గమనించాలని నిర్ణయించుకుంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..!!