క్యూబా రాజధాని హవానాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో భీకరమైన పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 మంది మరణించారు. దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 75 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హవానాలోని సరటోగా అనే ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ వల్ల పేలుడు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు చెప్తున్నారు.
భారీ శబ్దాలతో కూడిన పేలుడు జరగడంతో.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఏమైనా.. ఉగ్రవాదుల చర్యనా..? అని ఆందోళన చెందారు.
దీనిపై స్పందించిన క్యూబా అధ్యక్షుడు మగ్యుల్ డియాజ్ కెనెల్ కార్యాలయం.. ఇది ఎలాంటి ఉగ్రవాద చర్య కాదని.. హోటల్ లో గ్యాస్ లీక్ అవడం వల్లే పేలుడు జరిగిందని వెల్లడించింది.