హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్ర పోలీసులు భగ్నం చేశారు. భారీ పేలుళ్లతో నగర ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని కుట్రలు పన్నిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు.
ముగ్గురి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లను, దీంతో పాటు రూ.5.50 లక్షల నగదు, మరో ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో అబ్దుల్ జాహెద్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
నగరంలో ఉగ్రదాడులను జరిపేందుకు జాహెద్ కు దాయాది పాక్ నుంచి నిధులు అందాయని, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ కూడా అందాయని పేర్కొన్నారు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు, బీజేపీ,ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను వారు టార్గెట్ చేసుకున్నట్టు తెలిపారు.