కెమికల్ స్క్రాప్ ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో నజీర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మూసాపేట్ హెచ్‌పీ రోడ్ లోని గోదాంలో స్క్రాప్ ను ఆటోలోకి ఎక్కిస్తుండగా ఓ కెమికల్ డబ్బా కిందపడటంతో ఈ పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరణించిన వ్యక్తి ముషీరాబాద్ బోలక్‌పూర్‌కి చెందిన మహ్మద్ నజీర్.
నజీర్ కెమికల్స్ డబ్బలను టాటా ఏస్ వాహనంలో లోడ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, మృతుడు నజీర్ తండ్రి ఇస్మాయిల్ స్క్రాప్ కొనుగోలు చేస్తుంటాడని.. అలా స్క్రాప్ కొనుగొలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.
కాగా ఈ ఘటన గురించి గోదాం యాజమాని భాస్కర్ మాట్లాడుతూ..స్క్రాప్ ను ఆటోలో ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశాడు.నజీర్ తన వద్ద పది సంవత్సరాల నుంచి స్క్రాప్ కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో నజీర్ తో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్లు ఆయన తెలిపారు.
నజీర్చా లా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో కెమికల్ డబ్బా పేలడం వల్ల ప్రమాదం సంభవించిందా..లేక మరేదైనా కారణం ఉందా అనే దాని మీద పోలీసులు విచారిస్తున్నట్లు వివరించారు.