సంగారెడ్డి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడాలోని.. మైలాన్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గోదాంలో టెట్రా మేతేలే డిసిలోక్సానే అనే రసాయనాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన వారు చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్ రావు (38), కార్మికుడు మెహతా (40), రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దుర్మరణం చెందారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణలపై పర్యవేక్షిస్తున్నారు.