నగరంలోని వనస్థలిపురంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు.అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. టైర్ రీబటన్ కంపెనీ సహా భారీ ఎత్తున టైర్లు మంటల్లో దగ్ఘమయ్యాయి.
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై సమాచారం తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు సమాచారం. సుమారు రూ.20 లక్షల విలువ చేసే టైర్లు మంటల్లో కాలిపోయాయని చెబుతున్నారు.