మహారాష్ట్రలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో చోటచేసుకుంది. అయితే. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్ కరంజి నగర శివార్లలో వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్ ఉంది. అందులోని ఓ యూనిట్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖకు సమాచారం అందిచారు. హుటాహుటిన నాలుగు ట్యాంకర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అధికారులు.
సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేసినట్లు తెలిపారు. అయితే.. షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటోందని అనుమానిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.