ఒక జీవి ఎన్నేళ్ళు బతుకుతుంది. తాబేళ్లు వంటివి మహా అంటే 350 ఏళ్ళు బతుకుతాయి. అది కూడా అవి పూర్తి ఆరోగ్యంగా ఉంటే మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఇక చేపలు వంటివి అయితే 10 ఏళ్ళ వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పదేళ్ళ పాటు కూడా చేపలు బతకడం కష్టమే.
Also Read:ఆగని విమర్శల పర్వం.. 8 మంది సస్పెండ్
అయితే ఒక చేపకు మాత్రం చావు లేదు. టర్రిటాప్సీస్ డోహరన్ని అనే జెల్లీ చేప అన్ని జీవులకన్నా ఎక్కువ కాలం జీవిస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఈ చేపకు చావు అనేది లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చేపలు సముద్రంలో ఉండే ప్లాంక్టన్, చేప గుడ్లు, చిన్న నత్త జాతికి చెందిన జంతువులను తిని జీవనం సాగిస్తాయి. మరి అన్ని రోజులు ఏ విధంగా బ్రతుకుతాయి అనేదే కదా మీ సందేహం.
ఇవి గాయపడినప్పుడుగాని, లేదా అనారోగ్యానికి గురైనప్పుడు గానీ… మళ్ళీ తమ బాల్య స్థితికి వెళ్తాయి ఈ చేపలు. ఈ ప్రక్రియనే “ట్రాన్సడిఫరెన్సీయేషన్” అని పిలుస్తారు. ఈ పద్దతిలో భాగంగా ఆ చేప శరీరంలో ఉండే పాత కణాలు క్రొత్త కణాల కింద మార్పు చెంది వీటిని బాల్య స్థితికి తీసుకురావడానికి సహాయ పడతాయి. అయితే మనుషులలో కూడా అటువంటి కణాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్.. కేంద్రంపై సీరియస్..!