మంత్రి మల్లారెడ్డి టికెట్ల వేలంపాట - Tolivelugu

మంత్రి మల్లారెడ్డి టికెట్ల వేలంపాట

విద్యా వెంకట్, సీనీయర్ జర్నలిస్ట్

అధికార పార్టీపై అవినీతి ముద్ర -మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాధితుడు మంత్రి మాటలు విషయాన్ని దిగమింగలేక మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే లేరని బుకాయింపు -మీడియాకు సమాధానం చెప్పలేక దాటవేత.

ఒకనాడు ఒక పార్టీ ఓటుకు నోటుతో రాజకీయం చేస్తుందని ఆరోపించిన అధికార టీఆర్ఎస్ పార్టీ నేడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంది. తమకు ఎదురులేదని తమ పార్టీలోని నేతలే తమ పార్టీ అభ్యర్థులు పోటీ పడతారని పార్టీ అగ్రనేతల మాటలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు హాజరై ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గొడవ పడుతున్న వీడియో వైరల్ అయిన సంఘటన మరవకముందే మల్లారెడ్డి కార్పొరేటర్ సీటు కోసం డబ్బులు వసూలు చేశారనే సంభాషణ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకపోవడం మంత్రి మల్లారెడ్డి వసూళ్ల మాట నిజమేనన్న అనుమానం కలుగుతోంది. మాది నీతివంతమైన పాలన, అసలు ఉద్యమకారులను పక్కకుపెట్టి బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ కు పెత్తనం ఇవ్వడంతో వారు అవినీతి ఆరోపణలతో రోడ్డుకెక్కుతున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ సీటు కోసం యాభై లక్షల రూపాయల నుంచి 80లక్షల వరకు వసూళ్లు చేసి తమకు టికెట్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపాడని ఆరోపిస్తూ మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు చేస్తూ డబ్బులు ఇచ్చిన ఆధారాలను చూపుతానని మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయమై ఓ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన రిపోర్టర్ మంత్రి మల్లారెడ్డిని వివరణ కోరితే విసుక్కుంటూ సమాధానం చెప్పడం , ఎదురు ప్రశ్న వేసి దబాయించడం మల్లారెడ్డి చేసిన తప్పుకు అద్దం పడుతుంది. మరోవైపు మల్లారెడ్డికి ముడుపులు ఇచ్చిన టీఆర్ఎస్ నాయకుడు రాపోలు రాములు మాత్రం తాను మల్లారెడ్డికి టికెట్ కోసం డబ్బులు ఇచ్చానని తన వద్ద ఆధారాలు ఉన్నాయని, తనది అబద్దం అయితే చౌరస్తాలో ఉరివేసుకుంటానని చెప్పడం కొసమెరుపు.

ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లను మెచ్చుకుంటూ అవినీతి ఆరోపణలు అమాయకులను పిచ్చొ ళ్లను చేయడం అంటే ఇదేనేమో. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలను విమర్శించేముందు మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్ నేత రాపోలు రాములు వైరల్ అవుతున్న వీడియోపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp