ప్రముఖ కన్నడ రచయిత, హేతువాది, రిటైర్డ్ ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తాగుబోతు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. కొంత మంది రామ రాజ్యాన్ని నిర్మిస్తామంటూ చెబుతున్నారని ఆయన అన్నారు. రాముడు ఆదర్శప్రాయుడు కాదని ఆయన తెలిపారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండను చదివితే ఈ విషయం అర్థమవుతుందన్నారు.
ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించలేదన్నారు. కేవలం 11 ఏండ్లు మాత్రమే పరిపాలించాడని స్పష్టమవుతోందన్నారు. శ్రీ రాముడు కేవలం మధ్యాహ్న సమయంలోనే సీతతో కూర్చుంటాడన్నారు. మిగిలిన రోజంతా మత్తు పానీయాలు సేవిస్తూ గడుపుతారని తెలుస్తోందన్నారు.
శ్రీ రాముడు తన భార్య సీతను అడవులకు పంపించాడన్నారు. ఆమెను శ్రీరాముడు పట్టించుకోలేదని పేర్కొన్నారు. శూద్రుడైన శంభూకుడు ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తలను శ్రీరాముడు నరికాడన్నారు. అలాంటి రాముడు ఆదర్శ ప్రాయుడు అవుతాడా? అంటూ ప్రశ్నించారు.