హరీష్ రావును ఢిల్లీకి పంపించేందుకే..బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని బీజేపీ నేత NVSS ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి కు మారు పేరు బీఆర్‌ఎస్ అని, కమ్యూనిస్ట్ ల కోరిక మేరకే ఖమ్మం లో బహిరంగ సభ అని విమర్శలు చేశారు.
బీఆర్‌ఎస్ బలం ఏంటో అర్థమైంది కాబట్టి ఖమ్మంలో సభ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారని.. ఖమ్మం సభలో రైతులకు దిక్సూచి చూపిస్తానన్న కేసీఆర్ రైతులకు సంకెళ్లు వేసింది మరచిపోయారా అని ప్రశ్నించారు.
సభకు ముందు కేసీఆర్… రైతులకు క్షమాపణ చెప్పాలని.. పాస్ బుక్ లు బ్యాంకుల్లో తనఖా ఉండటం వల్ల ప్రజలు అవమానంగా ఫీలవుతున్నారన్నారు. కేసీఆర్ కు కమ్యూనిస్టులు వంత పాడుతున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ లో చేర్చుకున్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించలేదన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన అండగా ఉంటామని కాంగ్రెస్ భరోసా కల్పించలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ పై రాజకీయ ఎదురు దాడి చేయలేదని.. కేసీఆర్ ను కాపాడే పనిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భుజాలపైకి ఎత్తుకుందని ఆగ్రహించారు.