మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో తన వినియోగదారుల ముందుకు వస్తుంది. కొన్ని కాంటాక్ట్స్ నుంచి మీ లాస్ట్ సీన్ ను కనపడకుండా చేయడానికి వాట్సాప్ సిద్దమైంది. మనం వద్దు అనుకున్న వాళ్ళు లాస్ట్ సీన్ ను చూడకుండా కంట్రోల్ చేయవచ్చు. బీటా వెర్షన్ 22.9.0.70 లో యాప్ ప్రైవసీ సెట్టింగ్‌స్ లలో ‘లాస్ట్ సీన్’ విభాగంలో ‘ఎక్ష్సెప్ట్ మై కాంటాక్ట్స్ ‘ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read:21న వరంగల్ కు రేవంత్.. అదే టార్గెట్..!
వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలు సహా ఇతర అంశాల మీద కూడా వర్క్ చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ బీటా టెస్టింగ్‌లో ఉన్నది ఈ ఫీచర్. వాట్సాప్ లాస్ట్ సీన్ కు సంబంధించి ఇప్పుడు కాస్త చర్చలు జరుగుతున్నాయి. అత్యవసరమైన వాళ్ళు అర్ధరాత్రి వాట్సాప్ ఒపెన్ చేసినా ఇది కుటుంబ సమస్యలకు దారి తీస్తుంది అనే విమర్శలు ఉన్నాయి.
దీనికి సంబంధించి వినియోగదారులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పలు సందర్భాల్లో చెప్పారు. ఇక ప్రొఫైల్ ఫోటో లకు సంబంధించి కూడా వాట్సాప్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే మాట వినపడుతుంది. ఇది కొందరు మహిళల భద్రతకు సంబంధించిన విషయం అని దీనికి సంబంధించి మార్పులు చేయాలని కూడా కొందరు కోరుతున్నారు.
Also Read:కోదాడలో మరో దారుణం