పెళ్లికాని యువకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. గత ఐదేళ్లలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27 మంది యువకులను మోసం చేసింది. మలక్ పేటకి చెందిన సుల్తానా వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తుంది. పెళ్లి కానీ యువకులకు వల వేసి, వారితో సన్నిహితంగా మెలిగి శారీరకంగా కలిసినప్పుడు రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగుతుంటుంది.
2014 వ సంవత్త్సరం నుంచి సుల్తానా ప్రేమ పేరుతో యువకులను మోసం చెయ్యటం మొదలుపెట్టింది. 2018 సంవత్సరం లో 14 మంది ని వలలో వేసుకుని మోసం చేసింది. ఆ తరువాత 2019 లో ముగ్గురికి వల వేసి డబ్బులు డిమాండ్ చేసింది. సైఫాబాద్ పీఎస్‌లో 3, చాదర్‌ఘాట్‌లో 5, ఎల్బీనగర్‌లో 3, అంబర్‌పేట్ 2, అబిడ్స్‌లో 2, మీర్ చౌక్‌లో 4, నారాయణగూడ, మలక్‌పేట్, నల్లకుంట, ఉప్పల్ పోలీస్‌స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో మొత్తం 27 కేసులు ఆమెపై ఉన్నాయి. సుల్తానా బాధితుల్లో ఓ యంగ్ లాయర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.