భూ తగాదా కారణంగా రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణచోటుచేసుకుంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలో జరిగింది. తండ్రి కంకణాల రవీందర్ రెడ్డి, కుమారుడు సాయి కృష్ణల పై మరో కుటుంబంకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద కర్రలతో దారుణంగా కొట్టడంతో తండ్రి కొడుకులు రక్తస్రావంతో అక్కడే పడిపోయారు.
స్థానికుల వెంటనే వారిని మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి కంకణాల రవీందర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.