హైదరాబాద్ నగర రోడ్లపై చిరుత పులి కలకలం రేపింది. నడి రోడ్డుపై చాలా సేపు కదలకుండానే ఉండిపోవటంతో దాన్ని దగ్గర్నుండి చూసేందుకు ఓ లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో అతనిపై దాడి చేసింది చిరుత.
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత NH44 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది. చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో పని ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు వచ్చే లోపే చిరుత పారిపోయింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.