ఆకతాయి ఆగడాలు శృతిమించాయి. ఒక వివాహితను ప్రేమిస్తున్నానని తనతో వచ్చేయ్యాలని టార్చరు చేస్తున్నాడు. అంతటితో ఆగక రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళి దాడిచేసి తనతో వచ్చేయ్యాలని వత్తిడి చేసాడు. అడ్డుతొలగేందుకు తన భర్తను చంపేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు. చివరికి ఆమె ఆ ఆకతాయి నుంచి తప్పించుకుని, పోలీసుల్ని ఆశ్రయించింది.
ఆ వివరాల్లోకి వెళ్తే…సింహాచలంలో ఉంటున్న ఓ వివాహతపై కరోతి చంద్రశేఖర్ అనే ఆకతాయి కొంతకాలం నుంచి కన్నేశాడు. ఆమె అందానికి దాసోహమైన అతగాడు.. ఎలాగైనా ఆమెని తనని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
అయితే.. ఆమె మాట్లాడ్డానికి సరైన అవకాశం దొరకలేదు. అందుకోసం రాత్రి ఒంటరిగా ఉన్న ఆమె ఇంటికి వెళ్ళి మొదట సదరు వివాహితపై చాకుతో దాడి చేశాడు చంద్రశేఖర్. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయమైంది.
ఆ వెంటనే అతడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆ మహిళకు షాకిచ్చాడు. నీ భర్తని వదిలి నాతో వచ్చేయమని కోరాడు. నువ్వంటే పడి చస్తానని చెప్పాడు.
అవసరమైతే నీ భర్తని చంపించేస్తానని, తన వద్ద ఒక గ్యాంగ్ ఉందని బెదిరించాడు. ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకున్న మహిళ.. వెంటనే కుటుంబసభ్యులతో కలిపి పోలీసుల్ని ఆశ్రయించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఘటనలో గాయపడిన ఆ వివాహితకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చేతిపై గాయాలకు 6 కుట్లు వేశారు. అటు.. చంద్రశేఖర్ గురించి ఆరా తీయగా, అతడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నట్టు తేలింది.