ఓ వ్యక్తి తాగి స్థానికంగా హల్ చల్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ హంగామా సృష్టించాడు. తాను డాక్టర్‌ని అంటూ ఆస్పత్రి సిబ్బందికి చుక్కలు చూపించాడు.
హన్మకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్‌లో భార్గవ్ అనే వ్యక్తి తాగి హల్ చల్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. తాను డాక్టర్‌ని అంటూ అక్కడ వైద్యుల కూర్చిలో కూర్చున్నాడు.
తాను కూడా ఎంజీఎం ఆస్పత్రిలోనే డాక్టర్‌ని అంటూ హంగామా సృష్టించాడు. ఐడీ కార్డు చూపించాలని ఆస్పత్రి వైద్యులు ప్రశ్నించగా.. ఎందుకు చూపించాలని వాగ్వాదానికి దిగాడు.
ఐడీ కార్డు మీకెందుకు చూపించాలని.. ఆథారిటీని పిలవాలని హాస్పిటల్ సిబ్బందికి చుక్కలు చూపించాడు. ఈ ఘటనతో ఆస్పత్రిలో కాసేపు గందరగోళం నెలకొంది.