చాదర్ ఘాట్ లో విషాదం చోటు చేసుకుంది. మూసీ ప్రవాహంలో జహంగీర్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. కుమారుడితో కలిసి ఉదయం మూసీ దగ్గరకు వెళ్లగా అనుకోకుండా అందులో పడిపోయాడు. కుమారుడి కళ్ల ముందే కొట్టుకుపోయాడు జహంగీర్.
శంకర్ నగర్ లో నివాసం ఉండే జహంగీర్.. కార్పెంటర్ గా జీవనం సాగిస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.