ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ చేస్తున్నా హడావుడి మాములుగా లేదు. తమ అభిమానా హీరోల సినిమా విడుదల సందర్భంగా పటాసులు కాల్చుతూ డ్యాన్స్ చేస్తూ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే, తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన ఓ థియేటర్ వద్ద యువకుడు గన్‌తో హల్ చేశాడు. దీంతో అక్కడికి సినిమా చూడాటానికి వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా హడలిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద శుక్రవారం ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్ చేశాడు. థియేటర్ బయట గన్‌తో ఫోటోలకు ఫోజులిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రదర్శితమవుతుండగా.. ఆ యువకుడు తెర ముందు గన్‌తో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరిగాడు. అతడి తీరుతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అనంతరం యువకుడు థియేటర్ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అది డమ్మీ తుపాకీగా తేల్చారు. ఆ యువకుడిని విశ్వహిందూ పరిషత్‌లోని వ్యక్తిగా సదరు హసామి తెలిపారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైనా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఓ అద్భుతమని సినీ ప్రియులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.