కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానాలు మారుతున్నాయి. పూర్వం ప్రేమించిన వారు దక్కకపోతే త్యాగం చేసేవారని.. చరిత్ర కథనాలతు చెప్తున్నాయి. కానీ.. ఇప్పుడున్న ప్రేమలో మాత్రం తమకు దక్కనివారు ఇంకెవరికి దక్కకూడదనే విధంగా ప్రేమ అనేది పలసబారిపోయింది. యువతి యువకులు తమతో విడిపోయిన వారిపై రివైంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అలాంటి ఘటనే బ్రెజిల్ లో జరిగింది. ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిని కిడ్నప్ చేసి.. ఆమె ముఖం మీద తన పేరును సచ్చబొట్టు వేయించాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నేటిజన్లు స్పందిస్తున్నారు.
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల తాయానే కాల్డాస్ అనే యువతి.. గాబ్రియెల్ కొయెల్హో(20) 2019 నుండి ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం పాటు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ.. తర్వాత అనుమానం మొదలు అయ్యింది. యువతిపై దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో తాయానే తల్లి అతన్ని విడిచిపెట్టమని కూతురుకి సూచించింది. ఈ మేరకు ఇద్దరిని ఒప్పించింది. దీంతో అతనికి బ్రేకప్ చేప్పిన యువతి.. అతనికి కనిపించకుండా పోయింది. ఎనిమిది నెలల తర్వాత తాయానే ను కలిసిన యువకుడు.. ఇకపై తనను ఇబ్బంది పెట్టనని వాగ్దానం చేయడంతో తిరిగి ఇద్దరు కలుసుకున్నారు.
కాగా.. కొంతకాలం తర్వాత మళ్ళీ యువతిని హిసించడం ప్రారంభించాడు. ప్రియుడు హింసను తట్టుకోలేక మళ్ళీ బ్రేకప్ చెప్పింది ఆ యువతి. దీంతో ఆమెను తన తల్లిదండ్రులు కొన్ని నెలల పాటు సావో పాలోకు పంపించారు. తను టౌబాటే కు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రంగంలోకి దిగిన మాజీ ప్రియుడు.. ఆమెను మళ్లీ బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోలనే గత శుక్రవారం పాఠశాలకు వెళ్తున్న తాయానేను ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేశాడు. తన కారులోకి బలవంతంగా ఎక్కించుకుని ఎక్కి తౌబాటే మున్సిపాలిటీలోని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
ఆ యువకుడికి భయపడిన తాయానే .. అతను చెప్పినట్లు విన్నది. టాటో ఆర్టిస్ట్ అయిన కోయెల్హో.. తన పూర్తి పేరును యువతి ముఖం కుడి వైపున, ఆమె చెవి నుండి గడ్డం వరకు వేయించాడు. ఆ సమయంలో తాయానే పచ్చబొట్టు చేయడాన్ని తిరస్కరించనప్పటికీ.. గాబ్రియేల్ తన పేరుని ఆ యువతి ముఖంపై టాటూగా వేశాడు.
మరుసటి రోజు తాయానే తల్లి తన కూతురు కనిపించడం లేదని.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాయానే ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం తయనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రియేల్ కోయెల్హోను అదుపులోనికి తీసుకున్నారు. అయితే.. గాబ్రియేల్ తండ్రి తాయానే ముఖంపై తన కొడుకు టాటూ వేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కొడుకు చేసిన పనిని సమర్ధిస్తూ.. తాయానే ముఖంపై పచ్చబొట్టు వేసినందుకు సంతోషంగా ఉందని తన వాదనను వినిపించాడు.
Advertisements
ఇదిలా ఉంటే.. తన మొదటి లేజర్ రిమూవల్ సెషన్ కు హాజరైన తాయానే.. ముఖంపై ఉన్న టాటూను చెరిపేసే ప్రయత్నం మొదలు పెట్టింది. అయితే.. ఆ యువతి శరీరంపై కోయెల్హో పేరుతో మరో రెండు టాటూలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు అవి కూడా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.